వాల్మీకులను ఎస్టీల్లో చేర్చే వరకు పోరాటం

ABN , First Publish Date - 2022-07-03T06:01:14+05:30 IST

వాల్మీకులను ఎస్టీ జా బితాలో చేర్చేవరకు తమ పోరాటం ఆగదని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతినాయుడు పేర్కొన్నారు.

వాల్మీకులను ఎస్టీల్లో చేర్చే వరకు పోరాటం
మాట్లాడుతున్న క్రాంతినాయుడు


వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతినాయుడు

కొత్తచెరువు, జూలై 2: వాల్మీకులను ఎస్టీ జా బితాలో చేర్చేవరకు తమ పోరాటం ఆగదని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతినాయుడు పేర్కొన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితా లోకి చేర్చాలని కోరుతూ కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి అమరావతి వరకు చేపట్టిన మేల్కొలుపు యాత్ర శనివారం కొత్తచెరువుకు చేరింది. మండల వాల్మీకులు ఘనంగా స్వాగతంపలికారు. ఈ సందర్భంగా క్రాంతినాయుడు మాట్లాడుతూ... వా ల్మీకులను ఎస్టీజాబితాలోకి చేర్చుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, వైసీపీలు మరిచా యని విమర్శించారు. వాల్మీకుల ఐక్యత కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రాజకీయంగా వాల్మీకులకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వాల్మీకిసంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు బండ్లపల్లి రాజు, నాయకులు బోయశివ, డిపో భాస్కర్‌, ఏవీపీఎస్‌ ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ రామాంజనేయులు, గొట్లూరు చంద్ర, అక్కులప్ప పాల్గొన్నారు.



Updated Date - 2022-07-03T06:01:14+05:30 IST