‘వైన్‌ షాపుల్లో సిబ్బంది తొలగింపుపై పోరాటం’

ABN , First Publish Date - 2020-06-04T10:56:19+05:30 IST

ప్రభుత్వ వైన్‌ షాప్‌లలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను మద్యం పాలసీలో భాగంగా తొలగించే ఆలోచన ..

‘వైన్‌ షాపుల్లో సిబ్బంది తొలగింపుపై పోరాటం’

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), జూన్‌3: ప్రభుత్వ వైన్‌ షాప్‌లలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను మద్యం పాలసీలో భాగంగా తొలగించే ఆలోచన విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజిస్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాక మధు విజ్ఞప్తి చేశారు. ఏఐటీయూసీ కార్యాలయంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి బొమ్మిడి రాంబాబు అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కార్మికుల తొలగింపును నిరసిస్తూ జిల్లాలో ఈ నెల 5 నుంచి ఆందోళన  కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ప్రసాద్‌, రాజు, బాబి, చందు, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T10:56:19+05:30 IST