Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఐరన్‌తో... స్ట్రాంగ్‌గా...

ఆంధ్రజ్యోతి(12-05-2021)

మహిళల్లో, పిల్లల్లో ఎక్కువగా తలెత్తే సమస్యల్లో రక్తహీనత ఒకటి. దీనికి ప్రధాన కారణం ఐరన్‌ లోపం. తగినంత ఐరన్‌ ఆహారం ద్వారా తీసుకోకపోతే రక్తహీనత తలెత్తుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుంది. ఎన్నో వ్యాధులను ఆహ్వానించినట్టవుతుంది. గర్భం ధరించే వయసులో ఉన్న మహిళలు, చిన్న పిల్లలూ ప్రధానంగా రక్తహీనతకు లోనవుతూ ఉంటారు. హిమోగ్లోబిన్‌ పెరగాలంటే ఐరన్‌ సమృద్ధిగా ఉన్న ఆహారం తినడమే  పరిష్కారం. 


ఆహారంలో ఇవి ఉండాల్సిందే

ఆకు కూరల్లో ఐరన్‌ ఎక్కువ. కాబట్టి రోజువారీ ఆహారంలో బచ్చలి, తోట కూర, మునగాకు, మెంతి కూర లాంటి ఆకుకూరలను తప్పనిసరి భాగం చేసుకోవాలి. 

చిక్కుళ్ళు, టమాటా గుజ్జు, మునక్కాడలు, బ్రకోలీ, అవకాడో, దానిమ్మతో పాటు అనేక పండ్ల ద్వారా ఐరన్‌ అందుతుంది.

చేపలు, రొయ్యలు, రెడ్‌ మీట్‌, చికెన్‌, గుడ్లు... ఇలా ప్రధాన మాంసాహారాల్లో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. 

అలాగే డ్రై ఫ్రూట్స్‌, శనగలు, గుమ్మడి గింజలు, మెంతులు, నువ్వులు, సబ్జా గింజలు, అవిసె, తృణధాన్యాలు, ఉలవలు, బెల్లం... వీటన్నిటిలో ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది. 

శరీరం ఐరన్‌ను సమృద్ధిగా గ్రహించాలంటే... ఐరన్‌ ఉన్న పదార్థాలతో పాటు విటమిన్‌ సి ఉన్న ఆహారాన్ని కూడా తీసుకోవాలి.


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...