నాణ్యమైన తేనె ఉత్పత్తి కోసం కృషి చేయండి

ABN , First Publish Date - 2022-08-17T05:29:07+05:30 IST

జిల్లాకేంద్రంలో ఉన్న తేనే శుద్ధి కర్మాగారంలో నాణ్యమైన ఉత్పత్తుల కోసం కృషి చేయాలని ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్‌ రెడ్డి సూచించారు.

నాణ్యమైన తేనె ఉత్పత్తి కోసం కృషి చేయండి
తేనెశుద్ధి ప్రక్రియను పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి

ఐటీడీఏ పీవో వరుణ్‌ రెడ్డి

నిర్మల్‌ అర్బన్‌, ఆగస్టు 16 : జిల్లాకేంద్రంలో ఉన్న తేనే శుద్ధి కర్మాగారంలో నాణ్యమైన ఉత్పత్తుల కోసం కృషి చేయాలని ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్‌ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన సోఫీనగర్‌లో ఉన్న తేనే శుద్ధి కర్మాగారాన్ని సందర్శించారు. తయారీ విధానాన్ని పరి శీలించారు. నాణ్యమైన ఉత్పత్తుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై అక్కడ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. 

ఆశ్రమ పాఠశాల తనిఖీ..

జిల్లా పర్యటనకు వచ్చిన ప్రాజెక్టు అధికారి వరుణ్‌రెడ్డి స్థానికంగా ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యా ర్థులకు చదువుతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు, లలిత కళలపై అవగాహన కల్పించి శిక్షణ ఇవ్వాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. క్రీడలకు అవసరమైన సామాగ్రిని వెంటనే సమకూర్చాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలలో నాణ్యత లోపించకుండా చూడాలని ఆదేశించారు. వంటగదులతో పాటు డార్మెటరీలను పరిశీలిం చారు. ఆయన వెంట డీజీఎం విజయ్‌కుమార్‌ , ఈఈ భీమ్‌రావ్‌, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాస్‌లు ఉన్నారు. 

Updated Date - 2022-08-17T05:29:07+05:30 IST