కలెక్టరేట్‌ ముట్టడి

ABN , First Publish Date - 2022-05-24T06:15:22+05:30 IST

నంద్యాల కలెక్టరేట్‌ను ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు సోమవారం భారీఎత్తున ముట్టడించారు.

కలెక్టరేట్‌ ముట్టడి
ధర్నా చేస్తున్న ఉపాధి కూలీలు

నంద్యాల టౌన్‌, మే  23: నంద్యాల కలెక్టరేట్‌ను ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు సోమవారం భారీఎత్తున ముట్టడించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి శివనాగరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు సద్దాం హుసేన్‌ మాట్లాడారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బడ్జెట్‌లో రూ.98వేల కోట్లను, రూ.73వేల కోట్లకు తగ్గించిందని ధ్వజమెత్తారు. గడ్డపార, గంపకు అదనపు వేతనాన్ని రద్దు చేయడం బీజేపీ దుర్మార్గ పాలనకు నిదర్శనమని అన్నారు. పనిచేసిన కూలీలకు 15రోజుల్లో డబ్బు చెల్లించాలని చట్టంలో ఉన్నప్పటికీ నెలల తరబడి చెల్లించడం లేదని అన్నారు. ఉపాధి పనుల దగ్గర సౌకర్యాలు లేకపోవడంతో వడదెబ్బతో ఎంతోమంది మృతి చెందుతు న్నారని, ఆ కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. రెండుపూటలా పని విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య, పలువురు నాయకులు, ఉపాధికూలీలు పెద్దఎత్తున పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-24T06:15:22+05:30 IST