అంబేడ్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలుపుతున్న ప్రజాసంఘాల నాయకులు
పీలేరు, మే 26: కోనసీమ జిల్లాకు అం బేడ్కర్ పేరు పెట్టినందుకు జీర్ణించు కోలేక అమలాపురంలో అల్లర్లు సృష్టించి న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలి పారు. ఈ సందర్భంగా వారు మాట్లా డు తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఒక ప్రాంతా నికి, ఒక వర్గానికి నాయకుడు కాదని, విలువైన భారత రాజ్యాంగాన్ని అందించిన ప్రపంచ మేధావి అన్నారు. అంబేడ్కర్‌ను అవమానించిన వారిపై దేశద్రోహం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రజాసంఘాల నాయకులుఽ ధరణికుమార్, పాలకుంట్ల శ్రీని వాసులు, గట్టప్ప, మల్లికార్జున రాము, నాగేంద్ర, సుభాష్, అశోక్ పాల్గొన్నారు.