ఎయిర్‌పోర్ట్‌లో కట్టుదిట్టంగా భద్రత

ABN , First Publish Date - 2022-01-25T04:38:59+05:30 IST

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా

ఎయిర్‌పోర్ట్‌లో కట్టుదిట్టంగా భద్రత
భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది

శంషాబాద్‌, జనవరి 24: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. సీఐఎ్‌సఎఫ్‌, ఆర్జీఐఏ పోలీ్‌సస్టేషన్‌, రక్షా సిబ్బందితో వివిధ విభాగాల్లో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్టులోని ప్యాసింజర్‌ టర్మినల్‌, ఎయిర్‌పోర్టు విలేజ్‌, ఇంటర్నేషనల్‌, డొమస్టిక్‌ అరైవల్స్‌, డిపార్చర్స్‌, ఎయిర్‌పోర్టు ప్లాజా, క్యాంటిన్‌, పార్కింగ్‌ ఏరియా, రోటరీ, నోవాటెల్‌, ఎరీనా, హైదరాబాద్‌ నుంచి వచ్చే రింగ్‌రోడ్డు, చంద్రాయణగుట్ట నుంచి వచ్చే రోడ్డుతోపాటు ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిలో వచ్చే వాహనాలన్నీ తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులకు ఆటంకం కలగకుండా ఎయిర్‌పోర్టు బస్టాండు, కార్గో తదితర ప్రాంతాల్లో సాయుధ భద్రతా సిబ్బంది 24/7 విధులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్‌, మెటల్‌డిక్టేటర్‌, బాంబ్‌స్క్వాడ్‌లతో తనిఖీ చేపడుతున్నారు. 



Updated Date - 2022-01-25T04:38:59+05:30 IST