నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-05-25T05:52:54+05:30 IST

జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ

- కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి, మే 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ హెచ్చరించారు. మంగళవారం జిల్లాకేంద్రంలో విత్తనాలు, ఎరువుల డీలర్లతో అవగా హన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ విత్త నాల విక్రయాలపై సీఎం కేసీఆర్‌ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పీడీ చట్టం నమోదు చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలన్నారు. ప్రభు త్వం అనుమతించిన కంపెనీ విత్తనాలను ప్యాకెట్లలో మాత్రమే విక్రయించాలని, ఎలాంటి కల్తీకి పాల్పడడానికి అవకాశం ఉండదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ-పాస్‌ యంత్రాల ద్వారానే రైతులకు ఎరువులు, విత్తనాలను విక్రయించాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఇంటర్‌నెట్‌ సమస్యలను పరిష్కరించి ఈ-పాస్‌ యంత్రాలను వినియో గించాలని డీలర్లకు కలెక్టర్‌ ఆదేశించారు. ఈ-పాస్‌ యంత్రాల వినియోగంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ అధికారులు, విస్తరణ అధికా రులు, పోలీసు అధికారులు సమన్వయంతో ఎరువులు, విత్తనాల షాపులపై జాయిం ట్‌ తనిఖీలు నిర్వహించాలన్నారు. విత్తన వ్యాపారులు తమ దుకాణాల్లో తప్పనిసరి గా రిజిష్టర్‌ నిర్వహించాలని, లైసెన్స్‌ రెన్యూవల్‌ దరఖాస్తులను సమర్పించాలని కలె క్టర్‌ సూచించారు. విత్తన షాపులో అందుబాటులో ఉన్న విత్తనాల స్టాకు వివరాలను ఎప్పటికప్పుడు నోటీస్‌ బోర్డుపై నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ వి లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, ఇన్‌చార్జి డీసీపీ అఖిల్‌ మహాజన్‌, ఏపీసీ సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:52:54+05:30 IST