ధాన్యంలో తారం తీస్తే కఠిన చర్యలు: గంగుల

ABN , First Publish Date - 2022-05-15T08:45:27+05:30 IST

రైతులు విక్రయించే ధాన్యంలో నుంచి కిలో తారం తీసినా రైస్‌ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హెచ్చరించారు.

ధాన్యంలో తారం తీస్తే కఠిన చర్యలు: గంగుల

ఖమ్మం/వైరా, మే 14 (ఆంధ్రజ్యోతి): రైతులు విక్రయించే ధాన్యంలో నుంచి కిలో తారం తీసినా రైస్‌ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లులకు ఎలాంటి సంబంధం లేదని, ఎక్కడైనా తారం తీసినట్టు తెలిస్తే అధికారులకు, తనకూ ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు పైరవీల జోలికి వెళ్లొదని, ప్రతిభతో చదివి ఉద్యోగాలు పొందాలని నిరుద్యోగ యువతకు సూచించారు. శనివారం   మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి ఖమ్మంలో నూతనంగా రూ.3.50 కోట్లతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్‌ను ప్రారంభించారు. అనంతరం వైరాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ఖమ్మం డీపీఆర్సీ భవనంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు.  

Updated Date - 2022-05-15T08:45:27+05:30 IST