బాలల హక్కుల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు

ABN , First Publish Date - 2022-05-25T05:54:19+05:30 IST

బాలల హక్కుల పరిరక్షణకు సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసు కోవాలని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమి షన్‌ సభ్యుడు ఎ.దేవయ్య ఆదేశించారు.

బాలల హక్కుల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు
మాట్లాడుతున్న బాలల హక్కుల కమిషన్‌ సభ్యుడు ఎ.దేవయ్య

- బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు దేవయ్య

జ్యోతినగర్‌, మే 24 : బాలల హక్కుల పరిరక్షణకు సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసు కోవాలని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమి షన్‌ సభ్యుడు ఎ.దేవయ్య ఆదేశించారు. బాలల హక్కుల రక్షణ, వికాసం తదితర అంశాలపై మంగ ళవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాలులో దేవ య్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలుగా బాలలు ఉత్తమ విద్య, ఆడుకోవడంలాంటి అవకాశాలను కోల్పోయా రని, వాటిని మరోసారి పిల్లలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ విషయంలో సంబంధిత అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. పిల్లలు ఎద గడంలో పౌష్ఠికాహారం కీలక పాత్ర పోషిస్తుందని, మధ్యాహ్న భోజనం కింద విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అం దించాలని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్న పిల్లల కు పౌష్ఠికాహారం అందేలా చూడాలని, పిల్లల ఆరోగ్యంపట్ల అప్రమ త్తంగా ఉండాలన్నారు. పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేం దుకు క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని ఆయన తెలిపారు. పిల్లలు ఆడుతూ ఉల్లాసంగా విద్యనభ్యసించే విధంగా ప్రతి పాఠశాలలో మైదానం ఏర్పాటు చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తోందని, వాటిని విద్యా ర్థులు వినియోగించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవా లని దేవయ్య సూచించారు. పిల్లల వికాసం, డ్రాపౌట్లను నియంత్రిం చే విషయంలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం పేదలకు ఉచితంగా విద్య నందించాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రైవేటు పాఠ శాలల వివరాలను తనకు పంపాలని దేవయ్య ఆదేశించారు. సమీక్ష సందర్భంగా ఐసీడీఎస్‌, చైల్డ్‌లైన్‌, విద్య, వైద్య, ఆరోగ్యం, పోలీసు తదితర విభాగాల అధికారులు బాలలకు సంబంధించి ఆయా శాఖలో తీసుకుంటున్న చర్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. శాఖల పనితీరును మరింత మెరుగుపర్చుకునేందుకు చేపట్టాల్సిన పనులపై కమిషన్‌ సభ్యులు దేవయ్య అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆ సమావేశంలో అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) కుమార్‌ దీపక్‌, జిల్లా సంక్షేమాధికారి రవూఫ్‌ ఖాన్‌, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:54:19+05:30 IST