పిల్లలతో భిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ

ABN , First Publish Date - 2021-04-16T04:42:41+05:30 IST

పసిపిల్లలతో భిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు తప్పవని కడప డీఎస్పీ సునీల్‌ హెచ్చరించారు.

పిల్లలతో భిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ

కడప (క్రైం), ఏప్రిల్‌ 15 : పసిపిల్లలతో భిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు తప్పవని కడప డీఎస్పీ సునీల్‌ హెచ్చరించారు. ఎస్పీ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు కడప నగరంలోని పలు కూడళ్ల వద్ద పసిపిల్లలతో భిక్షాటన చేస్తున్న మహిళలను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ వద్ద కౌన్సెలింగ్‌ ఇచ్చా రు. ప్రధాన కూడళ్లలో హోటళ్లు, సినిమా హాళ్లు తదితర ప్రాంతాల్లో పసిపిల్లలను ఎ త్తుకుని భిక్షాటన చేస్తున్నారని, భిక్షాటన పే రుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పసిపిల్లలను కొందరు అద్దెకు తీసుకుని, మ రికొందరు వారి బంధువుల పిల్లలను తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ప లు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పిల్లలను చదివించాలే తప్ప వారిని మండుటెండల్లో తిప్పుతూ భిక్షాటన చేయించడం సరికాదన్నారు. కార్యక్రమంలో సీఐలు సత్యనారాయణ, అశోక్‌రెడ్డి, నాగభూషణం, ఆలీ, సత్యబాబు, ఎస్‌ఐలు మధుసూదన్రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-04-16T04:42:41+05:30 IST