కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-05-25T05:21:37+05:30 IST

Strict measures if selling adulterated seeds

కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

  • వికారాబాద్‌ ఏడీఏ వినోద్‌కుమార్‌

ధారూరు, మే 24 : కల్తీ విత్తనాలు, నిషేధిత క్రిమిసంహారక మందులు  అమ్మితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని, కేసులు నమోదు చేస్తామని వికారాబాద్‌ వ్యవసాయ సహాయ సంచాలకులు వినోద్‌కుమార్‌ తెలిపారు. మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో మంగళవారం విత్తన, ఫర్టిలైజర్‌ దుకాణాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పత్తి, కంది, మొక్కజొన్నతోపాటు ఇతర పంటలకు సంబంధించి  నాసిరకం విత్తనాలను విక్రయించరాదని చెప్పారు. నిషేధిత క్రిమిసంహారక మందులు, విత్తనాలు అమ్మరాదని తెలిపారు. అధికారుల అకస్మిక తనీఖీలు ఉంటాయని, విత్తనాల నిల్వలకు సంబంధించి రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని ఆయన సూచించారు. ఏవో జ్యోతి, ఎస్‌ఐ నరేందర్‌, ఏఈవో సంజూ, డీలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:21:37+05:30 IST