సారా విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-12-06T05:16:11+05:30 IST

సారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సోంపేట ఎక్సైజ్‌ సీఐ ఎస్‌.ధర్మారావు అన్నారు. బట్టిగళ్లూరులో వలంటీర్లు, గ్రామపెద్దలతో కలిసి శనివారం సాయంత్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సారా విక్రయిస్తే కఠిన చర్యలు
మాట్లాడుతున్న ఎక్సైజ్‌ సీఐ ధర్మారావు

సోంపేట రూరల్‌ : సారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సోంపేట ఎక్సైజ్‌ సీఐ ఎస్‌.ధర్మారావు అన్నారు. బట్టిగళ్లూరులో వలంటీర్లు, గ్రామపెద్దలతో కలిసి శనివారం సాయంత్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకార గ్రామాల్లో సారా విక్రయాలు అధికంగా ఉన్నాయని, పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో బారువ ఎస్‌ఐ జి.నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

1800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

హరిపురం : మందస మండలం సవర బాతుపురం గ్రామ సమీపంలోని కొండల్లో శనివారం నిర్వహించిన దాడుల్లో 1800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్టు ఎక్సైజ్‌ సీఐ ఎస్‌.ధర్మారావు, స్పెషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ వెంకటప్పలనాయుడు తెలిపారు. అలాగే 60 లీటర్లు సారాను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. డ్రమ్ములు, ఇతర సామగ్రిని సోంపేట ఎక్సైజ్‌ స్టేషన్‌కు తరలించినట్టు చెప్పారు. ఈ దాడుల్లో  మందస ఎస్‌ఐ రామారావు, ఎకైజ్‌ సిబ్బంది సూర్యారావు, మార్కారావు, విజయ్‌, రాజేష్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-06T05:16:11+05:30 IST