ప్లాస్టిక్‌ వినియోగిస్తే కఠినచర్యలు-కమిషనర్‌

ABN , First Publish Date - 2022-06-26T05:00:59+05:30 IST

పట్టణంలో జూలై 1వ తేదీ నుంచి ప్లాస్టిక్‌ను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్‌ పగడాల జగన్నాథ్‌ వ్యాపారులను హెచ్చరించారు.

ప్లాస్టిక్‌ వినియోగిస్తే కఠినచర్యలు-కమిషనర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌

ఎర్రగుంట్ల, జూన్‌ 25: పట్టణంలో  జూలై 1వ తేదీ నుంచి ప్లాస్టిక్‌ను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్‌ పగడాల జగన్నాథ్‌ వ్యాపారులను హెచ్చరించారు. శనివారం ఎర్రగుంట్లపట్టణంలోని వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 1వ తేదీనుంచి ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టణంలో ఎవరైనా అమ్మినా, కొన్నా, వినియోగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్లాస్టిక్‌ నిషేధానికి అందరూ సహకరించాలన్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్‌ వినయోగం పట్టణంలో విచ్చలవిడిగా ఉందన్నారు. వాటి స్థానంలో జ్యూట్‌ బ్యాగులు వినియోగించాలన్నారు. ఇకపై పట్టణంలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం ఉంటుందని, ఎవరు అతిక్రమించినా క్రిమినల్‌ కేసులు పెట్టేందుకు వెనకాడబోమన్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మధుకుమార్‌, శానిటరీ సెక్రటరీలు, సీవో విమల తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T05:00:59+05:30 IST