నాటుసారా అమ్మితే కఠిన చర్యలు: ఎస్పీ

ABN , First Publish Date - 2022-05-24T06:18:07+05:30 IST

నాటుసారా తయారీ, అమ్మకం, రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రఘువీర్‌రెడ్డి సోమవారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.

నాటుసారా అమ్మితే కఠిన చర్యలు: ఎస్పీ

నంద్యాల, మే 23 (ఆంధ్రజ్యోతి): నాటుసారా తయారీ, అమ్మకం, రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రఘువీర్‌రెడ్డి సోమవారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. నంద్యాల జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి నాటుసారా స్థావరాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇప్పటికే 398 కేసులు నమోదు చేసి 428 మందిని అరెస్టు చేశామని తెలిపారు.  దాదాపు 11 వేల లీటర్ల నాటుసారా సీజ్‌ చేశామని, సుమారు 1.80 లక్షల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. అంతే కాకుండా 31 వాహనాలను సజ్‌ సీజ్‌ చేశామని, 9,945 కేజీల బెల్లాన్ని పట్టుకున్నామని తెలిపారు.  ఏడుగురిపై పీడీ యాక్టు నమోదు చేసి కడప సెంట్రల్‌ జైలుకు తరలించామని తెలిపారు.  పరివర్తన ఆపరేషన్‌ 2.0లలో భాగంగా నాటుసారా తయారీ, రవాణా వలన కలిగే నష్టాలను వివరించి వారిలో పరివర్తన తీసుకువచ్చేలా అవగాహన కార్యక్రమాల ను ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - 2022-05-24T06:18:07+05:30 IST