లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-12-05T06:19:31+05:30 IST

లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో ఖాజావలి హెచ్చరించారు.

లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో ఖాజావలి

 ఆర్డీవో ఖాజావలి 

మచిలీపట్నం టౌన్‌ : లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో ఖాజావలి హెచ్చరించారు.  ఆర్డీవో కార్యాలయంలో శనివారం బందరు డివిజన్‌ స్థాయిలో జరిగిన సమావేశంలో ఆర్డీవో మాట్లాడారు. స్కానింగ్‌ సెంటర్లు, లేబరేటరీలు, ప్రైవేట్‌, ప్రభుత్వ ఆసుపత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. డివిజన్‌ స్థాయి కమిటీలో ఆర్డీవో, డీఎస్పీ, మెడికల్‌ ఆఫీసర్లు, లీగల్‌ అడ్వయిజర్‌, ఎస్‌టీవో సభ్యులుగా ఉంటారన్నారు. మండల స్థాయి కమిటీలో తహసీల్దార్‌, మునిసిపల్‌ కమిషనర్‌, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌, సీడీపీవో, మహిళా పోలీసులు సభ్యులుగా ఉంటారన్నారు. స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ నిర్వహిస్తామన్నారు. డీఎస్పీ మసూంబాషా మాట్లాడుతూ, స్కానింగ్‌ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే రహస్యంగా సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో మచిలీపట్నం డివిజన్‌ ప్రోగ్రాం అధికారి డా. బాలసుబ్రహ్మణ్యం, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ శివప్రసాద్‌, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ అరుణ కాత్యాయని, లీగల్‌ అడ్వయిజర్‌ మస్తానమ్మ, కె. పద్మ పాల్గొన్నారు.


Updated Date - 2021-12-05T06:19:31+05:30 IST