నకిలీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు

ABN , First Publish Date - 2022-05-25T05:49:51+05:30 IST

నకిలీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు

నకిలీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు

శంషాబాద్‌ రూరల్‌/కేశంపేట/ఆమనగల్లు, మే 24: నకిలీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని రాజేందర్‌నగర్‌ వ్యవసాయ శాఖ ఏడీఏ లీనారెడ్డి హెచ్చరించారు. ఆర్జీఐఏ, శంషాబాద్‌ సీఐలు శ్రీనివాస్‌, శ్రీధర్‌కుమార్‌లతో కలిసి వ్యవసాయశాఖ అధ్వర్యంలో మంగళవారం హామీదుల్లానగర్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఫర్టిలైజర్‌ యాజమానులు నకిలీవిత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారి షాపుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని తెలిపారు. బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సీఐ శ్రీధర్‌కుమార్‌ మాట్లాడుతూ.. డీలర్లు ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అధికారి కవిత, సర్పంచ్‌ సతీ్‌షయాదవ్‌, రాఘవేందర్‌, సంధ్య పాల్గొన్నారు. అదేవిధంగా కేశంపేటలోని ఫర్టిలైజర్‌ షాపుల్లో ఏడీఏ రాజారత్నం తనిఖీ చేశారు. తనిఖీల్లో ఏవో శిరీష, కేశంపేట ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్లు పట్టణంలోని ఆగ్రో రైతుసేవా కేంద్రం, మహేశ్వరి, వాసుదేవ సీడ్స్‌ దుకాణాలను మంగళవారం సాయంత్రం ఏవో అరుణకుమారి తనిఖీ చేశారు. ఏవో వెంట ఏఈవోలు, ఆయా దుకాణాల డీలర్లు ఉన్నారు.

Updated Date - 2022-05-25T05:49:51+05:30 IST