నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-06-24T04:42:14+05:30 IST

రైతులకు నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయశాఖ ఏడీ మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తున్న ఏడీ మురళీధర్‌రెడ్డి

 వ్యవసాయశాఖ ఏడీ మురళీధర్‌రెడ్డి

రాయచోటి, జూన్‌ 23:  రైతులకు నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయశాఖ ఏడీ మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాయచోటి నియోజకవర్గంలోని పలు ప్రాం తాల్లో విత్తన, ఎరువుల దుకాణాలను ఆసక్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణాల యజమానులు రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందజేయాలన్నారు. గడువు ముగిసిన ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, అధిక ధరలకు విక్రయించినా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏవో దివాకర్‌, రైతు భరోసా కేంద్ర సహాయకుడు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-24T04:42:14+05:30 IST