గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-10-27T03:59:29+05:30 IST

గంజాయి సాగు చేసినా, క్రయ విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్‌ సీఐ మోసీన్‌ అలీ హెచ్చరించారు. మంళవారం గంభీరావుపేట, ఎదులపహాడ్‌, దోన్ల, తలండి, కన్నెపల్లి, రాంబాబుగూడ, అరటిపల్లి తదితర గ్రామాలను సందర్శించారు.

గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు
గ్రామస్థులతో మాట్లాడుతున్న ఎస్సైజ్‌ సీఐ మోసీన్‌ అలీ

తిర్యాణి, అక్టోబరు 26: గంజాయి సాగు చేసినా, క్రయ విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్‌ సీఐ మోసీన్‌ అలీ హెచ్చరించారు. మంళవారం గంభీరావుపేట, ఎదులపహాడ్‌, దోన్ల, తలండి, కన్నెపల్లి, రాంబాబుగూడ, అరటిపల్లి తదితర గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి నిర్మూలన కార్యక్రమంలో భాంగా తిర్యాణి మండలంలో తమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీ నిర్వహిస్తున్నదని తెలిపారు. ఆయన వెంట ఎక్సైజ్‌ ఎస్సై విలాస్‌కుమార్‌, సర్పంచ్‌ సుజాత, సిబ్బంది విజయలక్ష్మి, కృష్ణమూర్తి, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T03:59:29+05:30 IST