నకిలీ విత్తనాలు అమ్మితే క ఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-05-15T06:39:09+05:30 IST

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుం టామని రాష్ట్ర విత్తన టాస్క్‌ఫోర్స్‌ అధికారి కమిషనర్‌ (ఏడీఏ) సుధాకర్‌బాబు అన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే క ఠిన చర్యలు


ఇచ్చోడ, మే14: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుం టామని రాష్ట్ర విత్తన టాస్క్‌ఫోర్స్‌ అధికారి కమిషనర్‌ (ఏడీఏ) సుధాకర్‌బాబు అన్నారు. మండల కేంద్రంలో గల ప్రైవేట్‌ విత్తన ఎరువులు వ్యాపార సముదాయలు, గోదాంలు నిల్వ ఉన్న విత్తన వివరాలు శనివారం తెలుసుకున్నారు. రైతులకు పూర్తి వివరాలతో రశీదు అందించాలన్నారు. ప్రతీ వ్యాపారి ఎప్పటికప్పుడు దుకాణాల్లో స్టాకు, ఎరువుల వివరాలు రికార్డులో ఉండాలని వారు సూచించారు. రైతులు అన్ని అనుమతులు పొంది లైసెన్సు కలిగి ఉన్న దుకాణాల్లో ఎరువులు, విత్తనాలు కొనాలన్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రైతులు తప్పని సరిగా పంటలు చేతికి వచ్చే వరకు రశీదు ఉంచాలన్నారు. రైతులు గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు నకిలీ ఎరు వులు, విత్తనాలు అమ్మితే రైతులకు అంటగట్టాలని చూస్తే వ్యవ సాయ అధికారులకు, పోలీసులకు సంప్రదించాలన్నారు. కార్యక్ర మంలో విత్తన ధ్రువీకరణ సంస్థ అధికారి ఏడీఏ శంకరయ్య, సీఐ పు రుషోత్తం, వ్యవసాయాధికారి జాదవ్‌కైలాస్‌, ఏఈవో ఉన్నారు.

Updated Date - 2022-05-15T06:39:09+05:30 IST