కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలు

ABN , First Publish Date - 2021-05-14T05:20:47+05:30 IST

కరోనా ఉధృతి నేపథ్యంలో నగరంలో కర్ఫ్యూని కట్టుదిట్టంగా అమలుచేస్తున్నట్టు సీసీఎస్‌ ఏసీపీ డి.శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలు
కర్ఫ్యూ నేపథ్యంలో సీతమ్మధారలో పోలీసుల తనిఖీలు

విశాఖపట్నం, మే 13 (ఆంధ్రజ్యోతి): కరోనా ఉధృతి నేపథ్యంలో నగరంలో కర్ఫ్యూని కట్టుదిట్టంగా అమలుచేస్తున్నట్టు సీసీఎస్‌ ఏసీపీ డి.శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ అమలుచేస్తున్నామన్నారు. అత్యవసర పనులపై వెళుతున్నవారికి, ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన రంగాలకు చెందిన ఉద్యోగులకు మాత్రం కర్ఫ్యూ నుంచి సడలింపు ఇస్తున్నామన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపై తిరిగేవారిని ఆపి ఎక్కడికి వెళుతున్నారనేదానిపై సిబ్బంది ఆరా తీస్తున్నారన్నారు. ఒకవేళ అనవసరంగా తిరుగుతున్నట్టు తేలితే వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి, కర్ఫ్యూ ఆవశ్యతను తెలియజేస్తున్నామన్నారు. ప్రజలతో సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగాలని సూచించినట్టు ఏసీపీ వివరించారు.


Updated Date - 2021-05-14T05:20:47+05:30 IST