గాజువాకలో పక్కాగా కర్ఫ్యూ అమలు

ABN , First Publish Date - 2021-05-09T05:08:21+05:30 IST

కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ గాజువాక ప్రాంతంలో రకరకాల కారణాలు చూపుతూ ప్రజలు రోడ్లపై తిరుగుతుండడంతో శనివారం నుంచి పోలీసులు మరింత కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు.

గాజువాకలో పక్కాగా కర్ఫ్యూ అమలు
నిర్మానుష్యంగా గాజువాక వందడుగుల రోడ్డు

గాజువాక, మే 8: కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ గాజువాక ప్రాంతంలో రకరకాల కారణాలు చూపుతూ ప్రజలు రోడ్లపై తిరుగుతుండడంతో శనివారం నుంచి పోలీసులు మరింత కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు.  వాహనదారుడి వద్ద పూర్తి ఆధారాలను పరిశీలించి మరీ విడిచిపెడుతున్నారు. సీఐ హెచ్‌.మల్లేశ్వరరావు పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు రోడ్లపై వాహనాలతో కనిపించే ప్రతి ఒక్కరినీ ఆపి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. కారణం లేకుండా తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపుతున్నారు. ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతం కావడంతో వివిధ కర్మాగారాల్లో పనిచేసే ఉద్యోగులు, అత్యవసర సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది ఎక్కువగా ఉండడంతో పోలీసులు పెద్దగా దృష్టి సారించ లేదు అయితే రోడ్లపై తిరుగుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో  అనవసరంగా రోడ్డుపై తిరిగేవారిపై కఠిన చర్యలు చేపడుతున్నట్టు సీఐ మల్లేశ్వరరావు స్పష్టం చేశారు. 


Updated Date - 2021-05-09T05:08:21+05:30 IST