కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీ

ABN , First Publish Date - 2021-07-27T05:21:41+05:30 IST

జిల్లాలోని పోలీసు స్టేషన్ల పరిధిలో భూకబ్జాదారులు, మోసాలకు పాల్పడే వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ దీపికా పాటిల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.

కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పీ
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ

విజయనగరం క్రైం: జిల్లాలోని పోలీసు స్టేషన్ల పరిధిలో  భూకబ్జాదారులు, మోసాలకు పాల్పడే వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని  ఎస్పీ దీపికా పాటిల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.  సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 26 ఫిర్యాదులు స్వీకరించారు.  అరగబత్తీల కంపెనీలో భాగస్వామిగా ఉండాలని చెప్పి తన వద్ద రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశారని విజ యనగరానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరాడు. తనకున్న కొంత వ్యవసాయ భూమిని అన్న కుమారుడు కాజేయాలని చూస్తున్నాడని ఎస్‌.కోటకు చెందిన వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని తమ కుటుంబ సభ్యులు కాజేయాలన్న ఉద్దేశంతో బెదిరింపులకు పాల్ప డుతున్నారని బాడంగి మండలానికి చెందిన మహిళ ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని క్షేత్రస్థాయి అధికారుల ను  ఎస్పీ ఆదేశించారు. ఏఎస్పీ  సత్యనారాయణరావు, సీఐలు వెంకటరావు, రాంబాబు, శ్రీనివాసరావు, ఎస్‌ఐలు నీలకంఠం, క ృష్ణవర్మ, సూర్యారావు ఉన్నారు. 

 

 

Updated Date - 2021-07-27T05:21:41+05:30 IST