Abn logo
Apr 20 2021 @ 23:59PM

కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు

హిందూపురం టౌన, ఏప్రిల్‌ 20: కొవిడ్‌ నిబంధనలు పాటించనివరిపై కేసులు నమోదు చేయడానికైనా వెనుకాడబోమని అధికారులు స్పష్టం చేశారు. హిందూపురంలో రోజు రోజుకు కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్‌ శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, వనటౌన సీఐ బాలమద్దిలేటి పట్టణంలోని పలు షాపులను తనిఖీ చేశారు. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో మాస్కులు ధరించనివారిపై జరిమానాలు విధించారు. షాపుల్లో భౌతికదూరం, శానిటైజర్‌ వాడకపోవడంతో జరిమానా విధించి మరోసారి ఇలా జరిగితే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. మెడికల్‌ షాపులో మాస్కులు వాడకుండా అందజేస్తుండటంపై అధికారులు సీరియస్‌ అయ్యారు. షాపులవద్ద భౌతిక దూరం, మాస్కులు ఉంటేనే మందులు ఇవ్వాలని హెచ్చరించారు. 

Advertisement
Advertisement
Advertisement