క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-10-25T07:38:47+05:30 IST

క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తిరుపతి అర్బన్‌ఎస్పీ వెంకటఅప్పలనాయుడు హెచ్చరించారు.

క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు
ఎస్పీ వెంకటఅప్పలనాయుడు

తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు హెచ్చరిక


తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 24: క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తిరుపతి అర్బన్‌ఎస్పీ వెంకటఅప్పలనాయుడు హెచ్చరించారు. టీ20 క్రికెట్‌ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం అర్బన్‌ జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. బెట్టింగ్‌బాబులు ఉంటారన్న అనుమానిత ప్రాంతాలతోపాటు తిరుపతి నగరం, ఇతర పట్టణ ప్రాంతాల్లోని లాడ్జీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. క్రికెట్‌ బెట్టింగ్‌పై ప్రత్యేక  నిఘా పెట్టామన్నారు. ప్రజలు కూడా తమవంతు బాధ్యతగా బెట్టింగులకు ఎవరైనా పాల్పడుతుంటే తమకు తెలియజేయాలని కోరారు. పెద్దలు సంపాదించిన విలువైన సంపదను పోగొట్టడంతోపాటు కేసులపాలై బంగారు జీవితాన్ని పాడు చేసుకోవద్దని యువతకు సూచించారు. పెద్దలు కూడా పిల్లలను గమనిస్తూ ఉండాలని చెప్పారు. 

Updated Date - 2021-10-25T07:38:47+05:30 IST