Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీఆర్‌ఎస్‌ పాలనలోనే స్థానిక సంస్థల బలోపేతం

మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

మిర్యాలగూడ, డిసెంబరు 5: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడమే కాకుండా మిషన్‌ భగీరథ ద్వారా సురక్షిత మంచినీరు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు కొనుగోలు చేయించామన్నారు. మునిసిపాలిటీల్లో మురికివాడల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టి పట్టణ సుందరీకరణకు చర్యలు తీసుకున్నామన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రాధాన్యం ఇచ్చిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంసీ.కోటిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే నోముల భగత్‌, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి,  మిర్యాలగూడ, నాగార్జున సాగర్‌ నియోజకవర్గాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్‌లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement