Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీని బలోపేతం చేయాలి

గ్రామాల్లో ప్రజాసమస్యలపై దృష్టి సారించండి

పార్టీ కేడర్‌కు మాజీ ఎమ్మెల్యే అనిత పిలుపు


ఎస్‌.రాయవరం, డిసెంబరు 8: గ్రామాల్లో ప్రజల సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు కృషిచేయడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. బుధవారం మండలంలోని పెట్టుగోళ్లపల్లి, రామయ్యపట్నం, చినగుమ్ములూరు గ్రామాల్లో నిర్వహించిన ‘గౌరవ సభ’ల్లో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, అభివృద్ధి తిరోగమనంవైపు పయనిస్తున్నదని విమర్శించారు. పాలకుల చేతగాని తనంవల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లపరాజు వెంకటరాజు, కొప్పిశెట్టి వెంకటేశ్‌, కురందాసు నూకరాజు, కొప్పిశెట్టి కొండబాబు, అల్లు నరసింహమూర్తి, గుర్రం రామకృష్ణ, అల్లు మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement