పానీపూరీ అమ్ముతూ రూ.5 కోట్ల స్కామ్.. అదెలాగంటే..

ABN , First Publish Date - 2021-11-29T11:45:45+05:30 IST

బడా బాబులు, రాజకీయ నాయకులే ప్రజలను మోసం చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు కూడా కోట్ల రూపాయల కుచ్చుటోపీ వేయగలరని నిరూపించాడు ఒక సాధారణ పానీపూరీ విక్రయించేవాడు...

పానీపూరీ అమ్ముతూ రూ.5 కోట్ల స్కామ్.. అదెలాగంటే..

బడా బాబులు, రాజకీయ నాయకులే ప్రజలను మోసం చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు కూడా కోట్ల రూపాయల కుచ్చుటోపీ వేయగలరని నిరూపించాడు ఒక సాధారణ పానీపూరీ విక్రయించేవాడు.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురా నగరానికి చెందిన నరేంద్ర పుజారి అనే వ్యక్తి గత 16 ఏళ్లుగా పానీపూరి బండి వ్యాపారం చేస్తున్నాడు. తన వద్దకు వచ్చే అందరినీ బాగా పలకరిచేవాడు. అలా అందరితో పరిచయం పెంచుకున్నాక నెలవారీ చిట్టీపాట నిర్వహించేవాడు. దాంతో పాటు ఎక్కువ వడ్డీ, భారీ లాభాల ఆశ చూపి తెలిసిన వారందరి వద్ద డబ్బు తీసుకున్నాడు. 


అలా దాదాపు 300 మందికి పైగా జనాల వద్ద రూ.5 కోట్లు తీసుకున్నాడు. ఒక్కసారిగా అతను కనపడకుండా పోయాడు. ఎక్కడికి పోయాడో.. ఎవరికీ తెలియదు. తాము మోసపోయామని గ్రహించిన కొందరు నరేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


పోలీసులు అతడి గురించి విచారణ చేయగా.. నరేంద్ర ఇంట్లో అతని భార్య ఉంది. ఆమెను పోలీసులు ప్రశ్నించారు. నరేంద్ర ఎక్కడికి వెళ్లాడో తెలియదని చెప్పింది. అతడు అంత డబ్బు ఎలా కూడ గట్టాడని, అతడిని ఎలా నమ్మారని పోలీసులు బాధితులను అడిగారు. నరేంద్ర ఇప్పటివరకు తీసుకున్న సొమ్ముకి బదులుగా సమయానికి చిట్టీ పాటలో లాభాలు పంచేవాడని, అధిక వడ్డీపై తీసుకున్న రుణాలు కూడా చెల్లించేవాడని, కానీ ఒక్కసారిగా మాయమయ్యాడని వారు తెలిపారు. పోలీసులు నరేంద్రపై చీటింగ్, ఫ్రాడ్ కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.


Updated Date - 2021-11-29T11:45:45+05:30 IST