వీధిదీపాలకు 48 గంటల్లోనే మరమ్మతులు!

ABN , First Publish Date - 2020-07-01T08:51:20+05:30 IST

గ్రామ వలంటీర్లకు వీధి దీపాల నిర్వహణ బాధ్యత అప్పగించాలని పంచాయతీరాజ్‌ శాఖ నిర్ణయించింది. మంగళవారం ఇక్కడ ఆ శాఖ మంత్రి...

వీధిదీపాలకు 48 గంటల్లోనే మరమ్మతులు!

గ్రామ వలంటీర్లకు వీధి దీపాల నిర్వహణ బాధ్యత అప్పగించాలని పంచాయతీరాజ్‌ శాఖ నిర్ణయించింది. మంగళవారం ఇక్కడ ఆ  శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఒక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సచివాలయాల్లో నియమితులైన విద్యుత్‌ అసిస్టెంట్ల ద్వారా వీధి దీపాలకు  అవసరమైన మరమ్మతులు చేయించాలని నిశ్చయించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. దీనిపై మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్‌ఈడీ వీధి దీపాల కాంతిపై తొంభై శాతం మంది ప్రజాప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారని, కానీ వాటి నిర్వహణ తీరు, మరమ్మతులపై ఎనభై శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వివరించారు. వీధి దీపాల మరమ్మతులకు ఇప్పుడు 72 గంటల సమయం తీసుకొంటున్నామని, ఇకపై 24-48 గంటల్లోనే బాగు చేసేలా గడువు పెట్టబోతున్నామని చెప్పారు. 

Updated Date - 2020-07-01T08:51:20+05:30 IST