న్యూయార్క్ వీధికి గణేషుడి పేరు.. హర్షం వ్యక్తం చేస్తున్న ఎన్నారైలు

ABN , First Publish Date - 2022-04-05T18:49:12+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ఓ వీధికి తాజగా అక్కడి అధికారులు గణనాధుడి పేరు పెట్టడం విశేషం. న్యూయార్క్‌లోని క్వీన్స్ బరోలోని ఫ్లషింగ్‌లోని ఓ వీధికి 'గణేష్ టెంపుల్ స్ట్రీట్' అని నామకరణం చేశారు. దీనికి కారణం ఆ వీధిలో ఉన్న అతి పురాతనమైన వినాయకుడి ఆలయం అని తెలుస్తోంది. ఈ ఐకానిక్ గణేష్ టెంపుల్ గౌరవార్థం..

న్యూయార్క్ వీధికి గణేషుడి పేరు.. హర్షం వ్యక్తం చేస్తున్న ఎన్నారైలు

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ఓ వీధికి తాజగా అక్కడి అధికారులు గణనాధుడి పేరు పెట్టడం విశేషం. న్యూయార్క్‌లోని క్వీన్స్ బరోలోని ఫ్లషింగ్‌లోని ఓ వీధికి 'గణేష్ టెంపుల్ స్ట్రీట్' అని నామకరణం చేశారు. దీనికి కారణం ఆ వీధిలో ఉన్న అతి పురాతనమైన వినాయకుడి ఆలయం అని తెలుస్తోంది. ఈ ఐకానిక్ గణేష్ టెంపుల్ గౌరవార్థం ఆ వీధికి 'గణేష్ టెంపుల్ స్ట్రీట్' అని పేరు పెట్టారు. శనివారం జరిగిన ఈ ప్రత్యేక నామకరణ కార్యక్రమానికి న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, క్వీన్స్ బరో అధ్యక్షుడు డోనోవన్ రిచర్డ్స్, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, దిలీప్ చౌహాన్, భారతీయ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు హాజరయ్యారు. 


కాగా, ఈ పురాతన ఆలయాన్ని1977లో స్థాపించారు. ఈ ఆలయాన్ని ఉత్తర అమెరికాలోనే తొలి, అతి పురాతన హిందూ దేవాలయంగా ది హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా పేర్కొంటోంది. ఇక ఇదే స్ట్రీట్‌కు ప్రముఖ అమెరికన్ ఉద్యమకారుడు జాన్ బౌన్ పేరు మీదుగా 'బౌన్ స్ట్రీట్' అనే పేరు కూడా ఉంది. శనివారం ఈ వీధి నామకరణం సందర్భంగా జరిగిన గణేష్ పూజలకు సంబంధించిన వీడియోను క్వీన్స్ బరో అధ్యక్షుడు డోనోవన్ రిచర్డ్స్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. న్యూయార్క్ వీధికి గణేషుడి పేరు పెట్టిన విషయాన్ని తెలుసుకున్న అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 





Updated Date - 2022-04-05T18:49:12+05:30 IST