Viral Video: తన విచిత్రమైన కళతో నెటిజెన్లచేత ఔరా! అనిపిస్తున్న మాస్టర్ చెఫ్

ABN , First Publish Date - 2021-11-22T05:44:13+05:30 IST

Viral Video: తన విచిత్రమైన కళతో నెటిజెన్లచేత ఔరా అనిపిస్తున్న మాస్టర్ చెఫ్...

Viral Video: తన విచిత్రమైన కళతో నెటిజెన్లచేత ఔరా! అనిపిస్తున్న మాస్టర్ చెఫ్

ఈ మధ్య ఇంటర్నెట్‌లో పలు విచిత్రమైన వీడియోలు దర్శనమిస్తున్నాయి. అవి చూసిన నెటిజెన్లు.. ఇలాంటివి కూడా ప్రపంచంలో ఉంటాయా? అని ఆశ్చర్య పోతుంటారు. అలాంటి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక స్ట్రీట్ ఫుడ్ విక్రయించే వ్యక్తి తను వండిన బీన్స్ డిష్‌ని గాల్లోకి ఎగిరేశాడు. అది రోడ్డు అవతల ఉన్న మరో వ్యక్తి కచ్చితంగా పట్టుకున్నాడు. ఆ రెండో వ్యక్తి ఆ బీన్స్ వంటకాన్ని పక్కనే కూర్చొని ఉన్న కస్టమర్లకు వడ్డించడానికి వెళుతున్నాడు. 


ఈ వీడియోలో ఆ స్ట్రీట్ ఫుడ్ వంట మాస్టర్ గాల్లో వంటకాన్ని అంత దూరం కచ్చితంగా విసరడం చూస్తే ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. అసలిది నిజమేనా! అని అనుమానం కలుగక మానదు.  ఈ వీడియో మొదట టిక్ టాక్‌లో దర్శన మిచ్చింది. అక్కడి నుంచి ఇన్‌స్టాగ్రాంలో ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ఈ వీడియోకి 2 కోట్ల 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.



Updated Date - 2021-11-22T05:44:13+05:30 IST