వీధికుక్కల దాడి... చిన్నారి మృతి

ABN , First Publish Date - 2020-05-31T18:29:48+05:30 IST

వీధి కుక్కల దాడిలో ఆమ్లోత్‌ బేబీ(6) అనే ఓ చిన్నారి మృతి చెందింది. బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని చెంగిచెర్ల శ్రీనివాస కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయాలపాలైన చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.

వీధికుక్కల దాడి... చిన్నారి మృతి

హైదరాబాద్ : వీధి కుక్కల దాడిలో ఆమ్లోత్‌ బేబీ(6) అనే ఓ చిన్నారి మృతి చెందింది. బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని చెంగిచెర్ల శ్రీనివాస కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయాలపాలైన చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.


బోడుప్పల్‌ డిప్యూటీ మేయర్‌ రవిగౌడ్‌ చిన్నారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. వీధి కుక్కలు నిర్మూలించడంలో విఫలమైన బోడుప్పల్ మున్సిపల్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-05-31T18:29:48+05:30 IST