GoAir aircraft: రన్ వేపై వీధికుక్క...లేహ్-ఢిల్లీ విమానం ఆలస్యం

ABN , First Publish Date - 2022-07-20T13:05:28+05:30 IST

విమానాశ్రయం రన్‌వేపై ఆకస్మాత్తుగా వీధికుక్క(stray dog) రావడంతో లేహ్-ఢిల్లీ(Leh-Delhi) గో ఫస్ట్ (Go First)విమానం టేకాఫ్(take-off)...

GoAir aircraft: రన్ వేపై వీధికుక్క...లేహ్-ఢిల్లీ విమానం ఆలస్యం

లేహ్(జమ్మూకశ్మీర్): విమానాశ్రయం రన్‌వేపై ఆకస్మాత్తుగా వీధికుక్క(stray dog) రావడంతో లేహ్-ఢిల్లీ(Leh-Delhi) గో ఫస్ట్ (Go First)విమానం టేకాఫ్(take-off) నిలిచిపోయింది. లేహ్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన గో ఫస్ట్ విమానం రన్‌వేపై కుక్క కారణంగా ఆలస్యం అయింది. లేహ్ విమానాశ్రయంలో రన్ వేపై గోఎయిర్ విమానం జి8-226 టేకాఫ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఆకస్మాత్తుగా రన్‌వేపై(runway)ఒక వీధి ప్రవేశించింది. అంతే లేహ్-ఢిల్లీ గో ఫస్ట్ విమానాన్ని నిలిపివేసి, వీధికుక్కను రన్ వే పైనుంచి తొలగించారు. అనంతరం ఆలస్యంగా గో  ఫస్ట్ విమానం ఢిల్లీకి బయలుదేరింది.



ముంబై-లేహ్ గో ఫస్ట్ (గతంలో గోఎయిర్) విమానాన్ని దాని ఇంజిన్‌లో లోపం కారణంగా ఢిల్లీకి మళ్లించాల్సి వచ్చింది. మరో సంఘటనలో అదే ఎయిర్‌లైన్‌కు చెందిన శ్రీనగర్-ఢిల్లీ విమానం దాని ఇంజిన్‌లో ఇబ్బందిని గుర్తించడంతో తిరిగి దాన్ని శ్రీనగర్ విమానాశ్రయానికే తిరిగి తీసుకువచ్చారు.ఈ ఘటనలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తు చేస్తుందని విమానాశ్రయ అధికారులు చెప్పారు. 

Updated Date - 2022-07-20T13:05:28+05:30 IST