విచ్చలవిడిగా గంజాయ్‌

ABN , First Publish Date - 2021-10-27T05:13:03+05:30 IST

దేశవ్యాప్తంగా ప్రస్తుతం డ్రగ్స్‌ దందాతోపాటు గంజాయి సాగుపై తీవ్ర దుమారం నడుస్తోంది.

విచ్చలవిడిగా గంజాయ్‌
మహబూబ్‌నగర్‌ జిల్లా మనికొండలో ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలను తొలగిస్తున్న పోలీసులు

- రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో వెలుగులోకి గంజాయి సాగు

- తక్కువ మొత్తంలోనే అయినప్పటికీ ఎక్కువ ప్రభావం

- అయిజ మండలం కుర్వపల్లిలో 175 మొక్కల స్వాధీనం

- 2018, 2019 సంవత్సరాల్లో కూడా  వెలుగులోకి 

- మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లోనూ కేసులు నమోదు

(ఆంధ్రజ్యోతి, వనపర్తి/గద్వాల) 

మహబూబ్‌నగర్‌/జడ్చర్ల/కొత్తకోట/ఇటిక్యాల:దేశవ్యాప్తంగా ప్రస్తుతం డ్రగ్స్‌ దందాతోపాటు గంజాయి సాగుపై తీవ్ర దుమారం నడుస్తోంది. కేసీఆర్‌ ఆదేశాలతో ఎక్సైజ్‌శాఖ అప్రమత్తమైంది. గంజాయి సాగు ఉమ్మడి జిల్లా లో అక్కడక్కడా  సాగవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అలాగే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుం చి ఎండు గంజాయి తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్న కేసు లు వెలుగులోకి వస్తున్నాయి.  మత్తులో యువకులు పాశవి క చర్యలకూ పాల్పడుతుండటం వల్ల అనేక సామాజిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించు కుని.. ముందుకెళ్లాల్సిన యువకులు మత్తుకు బానిసలు కావడంతో వారి భవిష్యత్‌ పాడుచేసకుఉంటున్నారే ఆందోళ న వ్యక్త మవుతోంది. చాలా ఏళ్లుగా ఉమ్మడి జిల్లాలో గంజా యి కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వాలు కఠిన చట్టా లు అమలు చేస్తుండటంతో సాగుకు చాలామంది వెనకడుగు వేశారు.  ప్రస్తుతం అక్కడక్కడా సాగు జరుగుతు న్నట్లు తెలుస్తుండగా.. ఎక్సైజ్‌శాఖ అప్రమత్తమైంది.  

వెలుగులోకి వస్తున్న సాగు..  

రాష్ట్ర ప్రభుత్వం గంజాయి సాగుపై అప్రమ త్తం కావడంతో ఇన్నిరోజులు సాగు జరగడం లే దని అనుకుంటుండగా.. తాజాగా కేసులు వెలుగు లోకి వస్తున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లా అమర చింత మండలం చంద్రఘడ్‌లో ఓ రైతు తన వ్యవ సాయ పొలంలో పెంచిన ఐదు గంజాయి మొక్కలు పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్‌ మండలం గాజులపేటలో ఓ రైతు పొలంలో 10 మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.  ఇదిలా ఉండగా గద్వాల డివిజన్‌ పరిధి చెన్‌గోన్‌ప ల్లిలో 2018లో 35 మొక్కలు స్వాధీనం చేసుకొని.. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అలాగే 2019లో అయిజ పీఎస్‌ పరిధిలో ఈడిగోనిపల్లిలో రెండు కేసులు, మేడికొండలో ఒకటి, బయ నంపల్లిలో ఒకటి, శాంతినగర్‌ పీఎస్‌ మద్దూరులో ఒక కేసు నమోదైంది. ప్రస్తుతం ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు ముమ్మ రం చేశారు. 

పక్క రాష్ట్రం నుంచే.. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అక్కడక్కడా  గంజా యి సాగు జరుగుతున్న విషయం వెలుగులోకి వస్తున్నది.  ఇక్కడ గంజాయి లాంటి వ్యవసనాలకు అలవాటుపడిన యు వకులు కొందరు పక్క రాష్ట్రమైన ఏపీలోని కర్నూలు నుంచి ఎండు గంజాయి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. సా ధారణంగా రాష్ట్రంలో జరిగే గంజాయి సాగు కంటే పక్క రాష్ట్రంలో జరిగే గంజాయిసాగు ఎక్కువని ఇటీవల కొన్ని ఘటనలు తెలియజేస్తున్నాయి. ఏపీతో సరిహద్దును పంచు కుంటున్న గద్వాల జిల్లాలోకి ఎక్కువగా ద్విచక్రవాహనాల్లో గంజాయి సరఫరా జరుగుతోందని తెలుస్తోంది. తాజాగా కొత్తకోటలో దొరికిన 150 గ్రాముల ఎండు గంజాయి కర్నూ లు నుంచే తెప్పించినట్లుగా నిందితుడు అధికారులకు తెలి పాడు. వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఎక్కు వగా అటు నాగర్‌కర్నూలు జిల్లాలోని నల్లమల నుంచే కా కుండా ఇటు కర్నూలు నుంచి కూడా గంజాయి సరఫరా అవుతోందని  సమాచారం. గ్రూపులుగా ఏర్పడుతున్న యు వత అక్కడ డీలర్లకు చెప్పి.. గంజాయిని తెప్పించుకుంటు న్నారు. పాడుపడిన బంగ్లాలు, ఎక్కువగా మనుషులు తిర గని ప్రాంతాలకు వెళ్లి గంజాయి తాగుతున్నారు. గంజాయి తోపాటు ఎక్కువ సంఖ్య లో ఇంటర్‌లోపు పిల్లలు బొనోఫిక్స్‌, వైట్‌నర్‌లాంటి మత్తుకు కూడా అలవాటు పడుతున్నట్లు తె లుస్తోంది. గంజాయిపై ఫోకస్‌ పెట్టిన అధికారులు బొనో ఫిక్స్‌, సులోచన్‌, వైట్‌నర్‌ ద్వారా మత్తును ఆస్వాధించే యువకులు, బాలురపై కూడా నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. 

ఒక్క రోజే..

తాజాగా మంగళవారం ఒక్కరోజే జోగు లాంబ గద్వాల జిల్లాలో ని అయిజ మండ లం కుర్వపల్లి ఎక్సైజ్‌ అధికారులు తని ఖీలు చేసి.. 175 గంజాయి మొక్కలను స్వాధీనం చేసు కొని కేసు నమోదు చేశారు. అలాగే ఇటిక్యాల మండలం వావిలాల శివారులో పత్తిలో అంతరపంటగా సాగుచేసిన  260 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకొని రైతు గూడురు రాములుపై కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్‌ పోలీసు లు రూరల్‌ మండలం మణికొండలో ఘన మోని చంద్రయ్య ఇంటి ఆవరణలో పెంచు తున్న రెండు మొక్కలు, ఘనమోని చంద్రప్ప  వ్యవసాయపొలంలో పెంచుతున్న మూడు మొక్కలను  పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. ఈ మొక్కలు దాదా పు పది అడు గుల ఎత్తు పెరిగినట్లు  తెలిపారు.  జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌కు కూతవేట దూరంలో ఉత్త రప్రదేశ్‌ రాష్ర్టానికి చెందిన షాన్‌వాజ్‌ నుంచి 15గ్రాములతో ఉన్న 19 ప్యాకెట్లను జడ్చర్ల పోలీసులు స్వాధీనం చేసుకొని  కేసు నమో దు చేశారు. కొత్తకోట పట్టణంలో 150 గ్రాముల గంజాయిని ప్రహ్లాద్‌ అనే వ్యక్తి స్కూటీలో తరలిస్తుండగా మంగళవారం పట్టుకుని కేసు నమోదు చేశారు. 




Updated Date - 2021-10-27T05:13:03+05:30 IST