Abn logo

స్ట్రాబెర్రీ మిల్క్‌

కావలసిన పదార్థాలు: స్ట్రాబెర్రీలు: పది, చక్కెర: పావు కప్పు, పాలు: మూడు కప్పులు (చిక్కగా మరిగించి చల్లార్చినవి), వెనీల్లా ఎక్స్‌ట్రాక్ట్‌- ముప్పావు స్పూను


తయారు చేసే విధానం: స్ట్రాబెర్రీ పండ్లని కడిగి ముక్కలుగా కోయాలి. ఓ పాన్‌లో స్ట్రాబెర్రీ ముక్కలు, చక్కెర వేసి కలపాలి. ఓ అరవై నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరవాత చిన్న మంటమీద పాన్‌ని పెట్టి స్ట్రాబెర్రీ మిశ్రమాన్ని వేడి చేయాలి. బాగా మరిగాక దించాలి. కాస్త చల్లారాక స్ట్రాబెర్రీలను స్పూన్‌తో మెదపాలి. వెనీల్లా ఎక్స్‌ట్రాక్ట్‌ను కలపాలి. చక్కెర తక్కువైనట్టుగా అనిపిస్తే మరికాస్త కలపాలి. చిక్కగానే ఉండాలి కానీ జామ్‌లా గట్టిగా మారకుండా జాగ్రత్తపడండి. పూర్తిగా చల్లారనివ్వాలి. ఓ గ్లాస్‌ పాలలో మూడు స్పూన్ల ఈ స్ట్రాబెర్రీ రసాన్ని బాగా కలిపి సర్వ్‌ చేయండి. మరికొన్ని స్ట్రాబెర్రీ ముక్కల్ని పైపైన అందంగా అలంకరించొచ్చు కూడా.

మ్యాంగో లస్సీజల్‌జీరామల్బరీ జ్యూస్‌పంజాబీ లస్సీరూహ్‌ అఫ్జా మోజిటోఆమ్‌ పన్నాసత్తు షర్బత్‌పాలకూర సలాడ్‌!పిస్తా మ్యాంగో కస్టర్డ్‌బాదం ఫిర్ని
Advertisement
Advertisement