కరోనా కట్టడికి వ్యూహం

ABN , First Publish Date - 2021-05-17T04:53:22+05:30 IST

కరోనా కట్డడికి పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా జిల్లాలో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నామని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రోజుకు 3,500 నుంచి 4 వేల వరకూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు.

కరోనా కట్టడికి వ్యూహం
కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

   

కొవిడ్‌ కిట్ల పంపిణీలో రాష్ట్రంలోనే మొదటి స్థానం 

జిల్లాలో 2,63, 248 ఆవాసాల్లో ఫీవర్‌ సర్వే

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

కలెక్టరేట్‌, మే 16: కరోనా కట్డడికి పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా జిల్లాలో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నామని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రోజుకు 3,500 నుంచి 4 వేల వరకూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల మొదటి వారంలో 25,416 పరీక్షలు చేయగా 6737 పాజిటివ్‌ కేసులు వచ్చాయని, రెండో వారంలో 22,220 పరీక్షలు చేయగా 5851 పాజిటివ్‌ కేసులు వచ్చాయని తెలిపారు. ఈనెలలో అత్యధికంగా ఇన్‌ఫెక్షన్‌ రేటు నమోదైనపప్పటికీ ప్రసుత్తం కొద్దిగా తగ్గుముఖం పడుతోందని చెప్పారు. గత నెలలో 77,352 పరీక్షలు నిర్వహించగా 9183 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. వైద్యులు, సిబ్బంది చూపిస్తున్న అంకితభావం, చిత్తశుద్ధి కారణంగా జిల్లాలో రికవరీ రేటు సగటున 85.7 శాతం నమోదవుతోందని వెల్లడించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 95.8 శాతం, హోం ఐసోలేషన్‌లో 83.8 శాతం, ఆసుపత్రిల్లో 87.3 శాతం రికవరీ రేటు ఉందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 6662 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని, వారిలో 6115 మందికి కొవిడ్‌ కిట్లను పంపిణీ చేయడం ద్వారా 91.79 శాతం రికవరీని సాధించి మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫీవర్‌ సర్వే జరుగుతోందని, ఇప్పటివరకూ 35.23 శాతం పూర్తయ్యందన్నారు. జిల్లాలో 7,42,312 ఆవాసాలకు గాను ఇప్పటి వరకూ 2,63,248 ఆవాసాల్లో సర్వే పూర్తయ్యందని తెలిపారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా చురుగ్గా జరుగుతోందని, 44 కేంద్రాల్లో కొవీషీల్డ్‌, 23 కేంద్రాల్లో కొవాగ్జిన్‌ వేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకూ 2,53,861 మందికి మొదటి డోసు, 1,02,432 మందికి రెండో డోసు వేసినట్లు కలెక్టర్‌ తెలియజేశారు.  


Updated Date - 2021-05-17T04:53:22+05:30 IST