అక్కడ వింత నియమం!

ABN , First Publish Date - 2021-01-16T05:34:05+05:30 IST

ప్రకృతి అందాలు కనిపిస్తే వెంటనే ఫోన్‌తో క్లిక్‌మనిపిస్తాం. సెల్ఫీలతో బిజీ అయిపోతాం. ఇక పర్యాటకులైతే కెమెరాలకు పని చెబుతారు

అక్కడ వింత నియమం!

ప్రకృతి అందాలు కనిపిస్తే వెంటనే ఫోన్‌తో క్లిక్‌మనిపిస్తాం. సెల్ఫీలతో బిజీ అయిపోతాం. ఇక పర్యాటకులైతే కెమెరాలకు పని చెబుతారు. అయితే ఈ పట్టణంలో మాత్రం ఫొటోలు తీయలేరు. ఆ నిబంధనే ఆ నగరంలో పర్యాటకులు పెరిగిపోవడానికి దోహదం చేసింది.

  • స్విట్జర్లాండ్‌లోని బెర్గున్‌ అనే పట్టణం కొండల మధ్య, పచ్చని పచ్చిక బయళ్ల నడుమ ఉంటుంది. అక్కడి ప్రకృతి అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. 
  • ఆ పట్టణం అందాలు ఎవరైనా వ్యక్తిగతంగా వచ్చి చూడాల్సిందే తప్ప, ఇంటర్నెట్‌లో, సోషల్‌ మీడియాలో చూడటం అక్కడి ప్రజలకు ఇష్టం లేదు. అందుకే ఫోటోలు తీయడంపై నిషేధం పెట్టారు.
  • ఫోటోలు తీయడం నిషేధం అని బోర్డులు సైతం పెట్టారు. ఆ నిబంధన పెట్టాక పర్యాటకుల తాకిడి ఇంకా పెరిగిందట. మౌత్‌ పబ్లిసిటీ వల్ల పర్యాటకుల సంఖ్య విశేషంగా పెరుగుతోందట.

Updated Date - 2021-01-16T05:34:05+05:30 IST