Abn logo
Nov 29 2020 @ 16:55PM

క్వీన్ ఎలిజబెత్‌కు వింత బహుమతులు

పుట్టినరోజులకో, పండుగలకో బహుమతులు అందుకోవడం సాధారణమే. అలాగే ఇంగ్లాండు మహారాణి క్వీన్ ఎలిజిబెత్ 2 తన జీవిత కాలంలో ఎన్నో బహుమతులు అందుకుంది. వాటిలో కొన్ని చాలా వింతైనవి. ఎవరూ వాటిని బహుమతులుగా అందుకుని ఉండరు. వాటిలో కొన్ని గిఫ్ట్‌లు ఇవన్నీ. 1972లో ఆఫ్రికాలో ఉన్న కామెరూన్ దేశ ప్రభుత్వం క్వీన్‌కు ఆఫ్రికన్ ఏనుగును బహుమతిగా పంపించింది. దాన్ని క్వీన్ లండన్ జూకు ఇచ్చేశారు. తన పెళ్లి రోజున అప్పటి ఆస్ట్రేలియాన్ ప్రభు్త్వం అయిదువందల టిన్నుల్లో ఫైనాపిల్ ముక్కలు పెట్టి పంపించింది. వాటిని ప్రజలకు పంచేశారు. క్వీన్‌కు గుర్రపుస్వారీ అంటే చాలా ఇష్టం.


 1991లో అమెరికా ప్రభుత్వం కౌబాయ్ బూట్లను బహుమతిగా పంపించింది. బ్రిటన్ పాలనలో సాగుతున్న వర్జిన్ ఐలాండ్ ప్రజలు ఓసారి క్వీన్‌కు అరకిలో ఉప్పును బహుమతిగా పంపించారు. ఫిజీకి చెందిన ప్రజలు స్పెర్మ్ జాతికి చెందిన తిమింగలం పన్నును మెడలో వేసుకునే పెండెంట్‌లా చేసి పంపించారు. ఫిజీలో వీటిని రోట్ల మీదే అమ్ముతుంటారు. వేరే దేశాల నుంచి కూడా క్వీన్‌కు అనేక రకాల బహుమతులు వచ్చాయి. అన్నింట్లో కాస్త కొత్తగా ఉన్నవి ఇవే. ఎక్కువగా పూలబొకేలు, చాక్లెట్లు, స్వీట్లు, దుస్తులు వస్తుంటాయి. 


Advertisement
Advertisement
Advertisement