శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొత్తఅమరాంలో వింత చేప లభ్యమైంది. ఆదివారం కొత్తఅమరాం గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు చెరువులో వేటాడుతుండగా ఈ చేప దొరికింది. పాము మాదిరి చేపపై నల్లటి చారలు కనిపించాయి. ఇంతవరకూ ఇటువంటి చేపను చూడలేదని, దీనిపేరు కూడా తమకు తెలియదని స్థానిక మత్స్యకారులు తెలిపారు.
- రాజాం