మట్టి దోపిడీ

ABN , First Publish Date - 2022-05-23T06:01:07+05:30 IST

రమణక్కపేటలోని ఇంజర్లమ్మ చెరువులో ఆదివారం ఉదయం నుంచి మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.

మట్టి దోపిడీ
రమణక్కపేట ఇంజర్లమ్మ చెరువులో మట్టి తవ్వకాలు

యథేచ్ఛగా తవ్వకాలు

అధికార పార్టీ నాయకుడి వసూళ్లు?

ప్రభుత్వ ఆదాయానికి గండి

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు?

మండలంలో  యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవటంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.  అధికార పార్టీ నాయకులు అండతోనే ఈ తవ్వకాలు జరుగుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ముసునూరు, మే 22: రమణక్కపేటలోని ఇంజర్లమ్మ చెరువులో ఆదివారం ఉదయం నుంచి మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటుక బట్టీలకు ఇష్టానుసారం మట్టి తరలిస్తున్నారని, ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాఽథుడే లేడని స్థానికు లు, టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వారం రోజుల నుంచి ఈ చెరువులో రాత్రి, పగలు తేడా లేకుండా మట్టి  తవ్వకాలు జరుగుతున్నా యని, ప్రభుత్వ  ఆదాయానికి గండి కొడుతున్నా అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీ నాయకుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారారని, అధికార పార్టీ నాయకుడు వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్నారు. మట్టి అక్ర మ తవ్వకాలపై  ఉన్నతాఽధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


మట్టి  తవ్వకాలు జరిపితే చర్యలు..

దీనిపై ముసునూరు తహసీల్దార్‌ కెఎస్‌ జోజి,  ఇరిగేషన్‌ ఏఈ  ఎస్‌కే సలీమ్‌ మాట్లాడుతూ  రమణక్కపేట ఇంజర్లమ్మ చెరువులో మట్టి  తవ్వకా లకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. స్ధానికులు, ప్రతిపక్ష  నాయకులు మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేయగా తవ్వకాలను అడ్డుకున్నాం. అనుమ తులు లేకుండా మట్టి  తవ్వితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.   


Updated Date - 2022-05-23T06:01:07+05:30 IST