గ్రంథాలయాలు నిస్తేజం

ABN , First Publish Date - 2022-01-24T06:21:53+05:30 IST

గ్రంథాలయాలు నిస్తేజంగా మారుతున్నాయి.

గ్రంథాలయాలు నిస్తేజం

రూ.10 కోట్ల మేర సెస్‌ పెండింగ్‌..

నిలిచిన భవనాల పనులు

తణుకు, జనవరి 23 : గ్రంథాలయాలు నిస్తేజంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల నుంచి రావాల్సిన సెస్‌లు రాకపోవడంతో నిర్వహణ కష్టంగా మారింది. రోజువారీ వచ్చే పుస్తకాలు, పత్రికల సరఫరా నిలిచిపోవడంతో గ్రంథాలయాలకు వెళ్లిన చదువరులకు నిరాశ ఎదురవుతోంది. జిల్లా గ్రంథాలయ సంస్థకు స్థానిక సం స్థల నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. ఏడాదికి రెండు కోట్ల చొప్పు న.. ఐదేళ్లకు సుమారు పది కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ఏ చిన్న అవసరం వచ్చినా సెస్‌ల ద్వారా వచ్చిన నిధులనే ఖర్చుచేయాలి. ఉద్యోగుల జీత భత్యాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. భవనాల అద్దెలు, స్టేషనరీ, విద్యుత్‌ బిల్లులు తదిరాలన్నీ సంస్థ చెల్లించుకోవాలి. కోట్లలో బకాయిలు ఉండటం వల్ల కొత్త భవనా ల నిర్మాణం, పాత వాటికి మరమ్మతులు వంటివి లేవు. పుస్తకాల కొనుగోలుకూ ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి గ్రంథాలయాలకు సరఫరా చేసే వివిధ రకాలైన పుస్తకాలు ముద్రణ ఆగిపోయింది. సరఫరాదారులు తమవల్ల కాదని నిలిచిపోయారు. గతంలో 30 రకాల వరకు పలు రకాలు పుస్త కాలు సరాఫరా చేసేవారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోవున్న 10 పుస్తకాలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 73 శాఖా గ్రంథాలయాలతోపా టు ఏలూరులో జిల్లా గ్రంథాలయం ఉంది. వివిధ మండలాల పరిధిలో రూ.2 కోట్ల తో కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. తణుకు, నరసాపురంలో భవనాలకు సంబంధించి పనులు మొదలు పెట్టాలి. టి.నరసాపురంలో కొత్త భవనం పూర్తయింది. భీమడో లులో దాతలు స్థలం కేటాయిస్తే నిర్మాణాలు చేపట్టేందుకు సంస్థ సిద్ధంగా ఉంది.  స్థానిక సంస్థల నుంచి రావాల్సిన బకాయిల గురించి వారితో మాట్లాడి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చీర్ల పద్మశ్రీ తెలిపారు. ఎక్కడైనా గ్రంథాలయాలు పాడైతే మరమ్మతులు చేపడుతున్నామని,  పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. 

Updated Date - 2022-01-24T06:21:53+05:30 IST