డిపోల వద్దే రేషన్‌

ABN , First Publish Date - 2021-03-07T05:20:16+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో రేషన్‌ పంపిణీ పెద్ద ప్రహసనంగా తయారైంది. ఇం టింటికీ రేషన్‌ పంపిణీకి వాహనదారులు చేతులెత్తే యడంతో చాలా ప్రాంతాల్లో చౌక డిపోల వద్దే రేషన్‌ ఇస్తున్నారు.

డిపోల వద్దే రేషన్‌

ఇంటింటికీ అంతంత మాత్రమే

ఏలూరు సిటీ, మార్చి 6: గ్రామీణ ప్రాంతాల్లో రేషన్‌ పంపిణీ పెద్ద ప్రహసనంగా తయారైంది. ఇం టింటికీ రేషన్‌ పంపిణీకి వాహనదారులు చేతులెత్తే యడంతో చాలా ప్రాంతాల్లో చౌక డిపోల వద్దే రేషన్‌ ఇస్తున్నారు. కొన్నిచోట్ల మాత్రమే ఇంటింటికీ జరుగు తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 1,883 చౌక డిపోల పరిధి లో ఎక్కువచోట్ల డిపోల వద్దే సరుకులు పంపిణీ చేస్తున్నారు. డిపోల వద్ద మొబైల్‌ వాహనాలను నిలి పి ఎండీయూ ఆపరేటర్‌ లాగిన్‌తో సరుకులు అంది స్తున్నారు. మార్చి కోటాకు సంబంధించి శనివారం తొలిరోజు పంపిణీలో సర్వర్‌ కష్టాలు తప్పలేదు. కేవలం 8 శాతం అంటే 20 వేల 37 మంది మాత్రమే పంపిణీ చేశారు. అర్బన్‌ ప్రాంతాల్లో 126 వాహనాల ద్వారా ఇస్తున్నారు. ఏలూరు నగరంతోపాటు తొమ్మిది మున్సిపాల్టీలలో ఇంటింటికీ సజావుగానే సాగుతోందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు చెబుతున్నారు. 


Updated Date - 2021-03-07T05:20:16+05:30 IST