సీరియస్‌గా కేసు వాదిస్తున్న పటేల్ చేతికి స్లిప్... ఆ తరువాత ఏం జరిగిందంటే...

ABN , First Publish Date - 2022-04-13T18:03:31+05:30 IST

సర్దార్ వల్లభాయ్ పటేల్‌ జీవితంలోని...

సీరియస్‌గా కేసు వాదిస్తున్న పటేల్ చేతికి స్లిప్... ఆ తరువాత ఏం జరిగిందంటే...

సర్దార్ వల్లభాయ్ పటేల్‌ జీవితంలోని ఒక ఆసక్తికర ఘటన ఇది. ఒకరోజు కోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసులో లాయర్ చిన్న తప్పిదాన్ని చేసినా నిందితునికి ఉరిశిక్ష పడే అవకాశం ఏర్పడుతుంది. నిందితుల తరపున వల్లభాయ్ పటేల్ వాదిస్తున్నారు. న్యాయమూర్తి అతని వాదనలు విన్నారు. కోర్టు విచారణ జరుగుతోంది. ఆ సమయంలో ఒక వ్యక్తి.. వల్లభాయ్ పటేల్‌కు కాగితం ఇవ్వడానికి అనుమతి కోసం న్యాయమూర్తిని అడిగాడు. న్యాయమూర్తి అతనికి అనుమతించారు. విచారణకు సంబంధించి ఏదైనా పత్రం ఉండవచ్చని న్యాయమూర్తి భావించగా, సర్దార్ పటేల్ కూడా అలాగే అనుకున్నారు. 


ఆ వ్యక్తి ఆ కాగితాన్ని సర్దార్ పటేల్‌కి ఇచ్చాడు. అతను దానిని చదివాడు. దానిలోని వాక్యాలను చదవగానే అతని మొహం మరింత గంభీరంగా మారింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు. కోర్టులోని వారు దీనిని ఆసక్తిగా గమనిస్తున్నారు. సర్దార్ పటేల్ ఆ కాగితాన్ని జేబులో పెట్టుకుని, తన కేసు మీద దృష్టి పెట్టారు. కొద్దిపేపటి తర్వాత విచారణ ముగిసింది. సర్దార్ పటేల్ వాదనల కారణంగా నిందితులకు విముక్తి లభించింది. అందరూ సర్దార్ పటేల్‌ను అభినందించారు. జడ్జి కూడా దీనినంతా వీక్షించారు. అప్పుడు అతని తోటి లాయర్లు పటేల్‌ను ఆ పేపర్ గురించి అడిగారు, ఆ పేపర్లో ఏముందని? ప్రశ్నించారు. అప్పుడు సర్దార్ పటేల్ ఇలా అన్నారు.. నేను చాలా త్వరగా ఇంటికి వెళ్లాలి. నా భార్య చనిపోయింది. అని అసలు విషయం చెప్పి పటేల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పటేల్ మాటలు విన్నవారంతా అతని అంకితభావానికి ఆశ్చర్యపోయారు. కేసు వాదనలో చిన్న పొరపాటు జరిగినా నిందితునికి ఉరిశిక్ష పడుతుందని పటేల్ భావించారు. తనకు ఎదురైన అంతకష్టంలోనూ విధి పట్ల అంకిత భావాన్ని ప్రదర్శించారు. 

Updated Date - 2022-04-13T18:03:31+05:30 IST