కాళియ మర్దనం!

ABN , First Publish Date - 2020-07-16T05:30:00+05:30 IST

చిన్ని కృష్ణుడి అల్లరి చేష్టలతో గోకులంలో రోజులన్నీ సందడిగా గడిచిపోతున్నాయి. ఒకరోజు గోకులం పక్కన ప్రవహిస్తున్న యమునా నదిలోకి కాళియుడు అనే సర్పం వచ్చి చేరింది...

కాళియ మర్దనం!

చిన్ని కృష్ణుడి అల్లరి చేష్టలతో గోకులంలో రోజులన్నీ సందడిగా గడిచిపోతున్నాయి. ఒకరోజు గోకులం పక్కన ప్రవహిస్తున్న యమునా నదిలోకి కాళియుడు అనే సర్పం వచ్చి చేరింది. పెద్ద పడగతో ఆ సర్పం అతి భయంకరంగా ఉండేది. దాని మూలంగా నీళ్లన్నీ విషపూరితం కావడం మొదలయ్యాయి. గ్రామస్థులు ఆ నీళ్లను తాగడానికి భయపడ్డారు. విషయం తెలుసుకున్న కృష్ణుడు ఆ పాముకు గుణపాఠం నేర్పాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నదిలోకి దూకాడు. కృష్ణుడిని కాటేయాలని కాళియుడు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ కృష్ణుడి ముందు దాని ఆటలు సాగలేదు. చివరకు కృష్ణుడు కాళియుడి పడగ మీద నిల్చొని నృత్యం చేశాడు. ఆయన బరువును మోయలేక కాళీయం కృష్ణుడి చంపొద్దని  వేడుకున్నాడు. అందుకు సరేనన్న కృష్ణుడు, ఈ నదిని వదిలేసి మరోచోటకు వెళ్లి బతకమని అన్నాడు. కాళియుడు ఆ నదిని వదిలి వెళ్లిపోయాడు. గ్రామస్థులందరూ కృష్ణుడి లీలలు చూసి హర్షధ్వానాలు చేశారు.


Updated Date - 2020-07-16T05:30:00+05:30 IST