బంగారు గుడ్డు!

ABN , First Publish Date - 2020-08-10T05:30:00+05:30 IST

ఒక ఊళ్లో ఓ రైతు ఉండే వాడు. అతని దగ్గర ఒక బాతు ఉండేది. ఆ బాతు రోజూ ఒక బంగారు గుడ్డు పెట్టేది. ఆ గుడ్డు అమ్మగా వచ్చే డబ్బుతో ఆ రైతు కుటుంబం చాలా సంతోషంగా జీవించేది...

బంగారు గుడ్డు!

ఒక ఊళ్లో ఓ రైతు ఉండే వాడు. అతని దగ్గర ఒక బాతు ఉండేది. ఆ బాతు రోజూ ఒక బంగారు గుడ్డు పెట్టేది. ఆ గుడ్డు అమ్మగా వచ్చే డబ్బుతో ఆ రైతు కుటుంబం చాలా సంతోషంగా జీవించేది. అలా రోజులు సంతోషంగా గడుస్తూ ఉండగా, ఒకరోజు రైతుకు అత్యాశ కలిగింది. 

‘‘రోజూ ఒక గుడ్డుతో ఎన్నాళ్లు ఇలా ఉంటాను. ఒకేసారి బాతు పొట్టలో ఉన్న గుడ్లన్నీ తీసుకుంటే ధనవంతుడిని అయిపోతాను’’ అని అనుకున్నాడు. తన ఆలోచనను భార్యకు చెప్పాడు. ఆమె కూడా సరేనంది. మరుసటి రోజు రైతు, అతడి భార్య కలిసి బాతును చంపి, పొట్ట కోసి చూశారు. బాతు పొట్టలో రక్తం, మాంసం తప్ప మరేమీ కనిపించలేదు. రైతుకు తన తప్పు తెలిసొచ్చింది. ‘నా తెలివితక్కువ తనంతో బంగారుగుడ్డు పెట్టే బాతును చంపుకున్నాను’ అంటూ కుమిలిపోయాడు. 

Updated Date - 2020-08-10T05:30:00+05:30 IST