పెద్దల ఆశీర్వాద ఫలితాన్ని తెలిపే మహాభారత కథ!

ABN , First Publish Date - 2022-05-09T13:59:54+05:30 IST

మహాభారతంలో అర్జునుడు.. గంధర్వరాజు చిత్రరథుడు...

పెద్దల ఆశీర్వాద ఫలితాన్ని తెలిపే మహాభారత కథ!

మహాభారతంలో అర్జునుడు.. గంధర్వరాజు చిత్రరథుడు ఒకానొక సందర్భంలో యుద్ధం చేశారు. అర్జునుడు యుద్ధంలో గెలిచాడు. అప్పుడు అర్జునుడు.. చిత్రరథుడిని 'మీరు మమ్మల్ని ఎలా ఓడించారు?' అని అడిగాడు. దీనికి చిత్రరథుడు 'మీ కుటుంబాన్ని మీ ఇంటిలోని పెద్దలు ఆశీర్వదించారు' అని చెప్పాడు. ఇద్దరూ ఇలా సంభాషించుకుంటుండగా గంధర్వరాజు అర్జునుడిని.. తపతి నందనుడని పిలిచాడు... ‘నన్ను తపతి నందనుడు అని ఎందుకు పిలుస్తున్నారు' అని అర్జునుడు అడిగాడు. దీనికి గంధర్వరాజు సమాధానమిస్తూ.. 'సూర్యదేవునికి తపతి అనే కూతురు ఉంది. 


నీ వంశంలో సంవరన్ అనే రాజు ఉండేవాడు. ఒకసారి సంవరన్.. తపతిని చూశాడు. చేసుకుంటే ఆమెనే వివాహం చేసుకోవాలనుకున్నాడు, సూర్యదేవునికి తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి, ముందుగా ఈ విషయాన్ని సంవరన్ తన గురువైన వశిష్టునికి తెలియజేశాడు. వశిష్ఠుడు.. సూర్యదేవునితో మాట్లాడాడు. దీని తర్వాత సంవరన్..తపతిల వివాహం జరిగింది. గంధర్వరాజు ఇంకా మాట్లాడుతూ, 'గురువులు, పురోహితులు, బ్రాహ్మణుల ఆశీస్సులు కలిగవుండి, పండితులను గౌరవించే రాజవంశంలోని వారు తలచిన పనులన్నీ పూర్తవుతాయన్నాడు. మీ గురించి వశిష్ఠుడు గతంలో సూర్యదేవునితో మాట్లాడాడు. అతని ఆశీస్సులు నీకు ఉన్నాయి కాబట్టి నాతో చేసిన యుద్ధంలో కూడా గెలిచావు.' అని అన్నాడు. గంధర్వరాజు చిత్రరథుడు అర్జునుడికి చెప్పిన విషయాల ప్రకారం చూస్తే గురువులు, పండితుల, ఋషులు, పెద్దల ఆశీస్సులు ఉన్నవారి కార్యాలన్నీ పూర్తవుతాయనే సందేశం మనకు ఈ కథ ద్వారా తెలుస్తోంది. 

Read more