గత 24 గంటల్లో దేశంలోని 19 రాష్ట్రాల్లో కరోనా మరణాలు నిల్!

ABN , First Publish Date - 2021-02-25T13:05:50+05:30 IST

దేశంలో గడచిన 24 గంటల్లో మొత్తం 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో...

గత 24 గంటల్లో దేశంలోని 19 రాష్ట్రాల్లో కరోనా మరణాలు నిల్!

న్యూఢిల్లీ: దేశంలో గడచిన 24 గంటల్లో మొత్తం 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కోవిడ్-19 మృతి కూడా చోటుచేసుకోలేదు. అయితే ప్రస్తుతం 1,46,907 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో కొత్తగా 13,742 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 14,037 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 


గడచిన వారం రోజుల వ్యవధిలో దేశంలోని 12 రాష్ట్రాల్లో రోజుకు సగటున వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్నాటక, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో గడచిన వారంలో రోజుకు 4,000 కరోనా కేసులు నమోదవుతూ వచ్చాయి.  కాగా గడచిన 24 గంటల్లో 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మృతి కూడా నమోదు కాలేదు. గుజరాత్, హరియాణా, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్, చండీగఢ్, అసోం, లక్షద్వీప్, హిమాచల్ ప్రదేశ్, లధాఖ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అండమాన్, నికోబార్ దీవులు, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో ఒక్క కరోనా మృతి నమోదు కాలేదు. వ్యాక్సినేషన్ 39వ రోజున అంటే ఫిబ్రవరి 23న దేశంలో మొత్తం 4,20,046 మందికి కరోనా టీకాలు వేశారు.

Updated Date - 2021-02-25T13:05:50+05:30 IST