మహనీయులారా.. మన్నించండి..!

ABN , First Publish Date - 2021-04-17T06:09:10+05:30 IST

మహనీయులు, చరిత్రకారులు కూడా ప్రభుత్వానికి లోకువయ్యారు. వారి జయంతులు, వర్ధంతులు ఘనంగా నిర్వహించాలని ఆర్భాటాలే తప్పా.. చేతల్లో కనిపించట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నా యి. నిర్వహణకు రెండేళ్లలో రూపాయి కూ డా విదల్చలేదు. చందాలు వేసుకుని, అధికారు లు.. మహనీయులకు నివాళులర్పించాల్సి వస్తోం ది. ఎన్నాళ్లిలా చేయగలమని సంక్షేమ శాఖల అధికారులు వాపోతున్నారు.

మహనీయులారా.. మన్నించండి..!

నివాళులు అర్పించేందుకూ నిధుల్లేవ్‌..!

చందాలతోనే కార్యక్రమాలు

జయంతి, వర్ధంతులకు 

రెండేళ్లుగా పైసా విదల్చని ప్రభుత్వం

లబోదిబోమంటున్న 

సంక్షేమ శాఖల అధికారులు

అనంతపురం క్లాక్‌టవర్‌, ఏప్రిల్‌ 16: మహనీయులు, చరిత్రకారులు కూడా ప్రభుత్వానికి లోకువయ్యారు. వారి జయంతులు, వర్ధంతులు ఘనంగా నిర్వహించాలని ఆర్భాటాలే తప్పా.. చేతల్లో కనిపించట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నా యి. నిర్వహణకు రెండేళ్లలో రూపాయి కూ డా విదల్చలేదు. చందాలు వేసుకుని, అధికారు లు.. మహనీయులకు నివాళులర్పించాల్సి వస్తోం ది. ఎన్నాళ్లిలా చేయగలమని సంక్షేమ శాఖల అధికారులు వాపోతున్నారు.

మహనీయులు, చరిత్రకారుల జ యంతి, వర్ధంతులను నిర్వహించే బాధ్యత ప్ర భుత్వాలపైనే ఉంటుంది. వాటికి సంబంధించిన నిధులను ఇవ్వాలి. రెండేళ్లుగా మహానేతల జ యంతి, వర్ధంతులకు పైసా కూడా నిధులు ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తూ వస్తోంది. దీంతో నిర్వహ ణ బాధ్యతలు తీసుకునే ఆయా సంక్షేమ శా ఖ ల అధికారులు నిధులు లేకుండా ఎలా నిర్వహించాలని ఆవేదన చెందుతున్నారు. మహనీయులను స్మరిస్తూ, భావితరాలకు బాటలు వే యాలని ప్రభు త్వ పెద్దలు, అధికారులు వేదికలపై గొప్పగా మాట్లాడుతుండటం చూస్తూనే ఉంటాం. ఆ మహనీయుల జయంతి, వర్ధంతులకు అయ్యే ఖర్చుకు సంబంధించి పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం శోచనీయం.


ఒక్కో కార్యక్రమానికి రూ.లక్షల్లో ఖర్చు

ఏ చిన్న కార్యక్రమం నిర్వహించాలన్నా రూ.లక్షల్లోనే ఖర్చవుతుంది. ఏటా ముఖ్యంగా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌, మాజీ ఉపప్రధాని జగ్జీవనరామ్‌ జయంతి, వర్ధంతులతోపాటు చిన్నచిన్న కార్యక్రమాలు నిర్వహిస్తారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతీరావ్‌ఫూలే, సావిత్రీబాయి ఫూలే జయంతి, వర్ధంతులు తదితరాలు నిర్వహిస్తుంటారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ ది నోత్సవం, అల్లూరి సీతారామరాజు, భారత తొ లి విద్యాశాఖ మంత్రి అబుల్‌కలాం ఆజాద్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటన్నింటికీ ప్రభుత్వం సాధారణంగా నిర్వహణ ఖర్చులకు సంబంధించిన నిధులను మంజూరు చేయాలి. రెండేళ్లుగా పైసా కూడా ఇవ్వట్లేదు. ఆయా శాఖల వార్డెన్లు, సిబ్బంది తలోచేయి వే సి, నిధులు సమకూర్చుకుని, నిర్వహిస్తున్నారు. ఇలా ఎన్నాళ్లు జేబుల్లో నుంచి తీసి, ఖర్చుపెట్టాలని వాపోతున్నారు. ఈ విషయంపై స్పందించేందుకు ఆయా సంక్షేమ శాఖల అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, మహనీయుల జయంతి, వర్ధంతులకయ్యే ఖర్చుకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని ఆయా అధికారులు కోరుతున్నారు.

Updated Date - 2021-04-17T06:09:10+05:30 IST