సెలెక్టెడ్‌ యూజర్లకు స్టోరీ హైడ్‌ చేయొచ్చు

ABN , First Publish Date - 2022-07-02T08:57:04+05:30 IST

ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టోరీలను ఫాలోవర్లు అందరూ చూడొచ్చు.

సెలెక్టెడ్‌ యూజర్లకు స్టోరీ హైడ్‌ చేయొచ్చు

ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టోరీలను ఫాలోవర్లు అందరూ చూడొచ్చు.  అయితే కొంత మంది ఫాలోవర్లు లేదంటే, ఎంపిక చేసిన కొద్ది మంది యూజర్లు వాటిని చూడకూడదని అనుకుంటే ఇప్పటివరకు ఎలాంటి సొల్యూషన్‌ లేదు. అందుకోసం ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ ఒక ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీంతో మనం వద్దు అనుకునే వారికి మన స్టోరీలు కనిపించకుండా హైడ్‌ చేయొచ్చు. 


స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

ఎవరు మీ స్టోరీ చూడకూడదు అనుకుంటున్నారో వారి ప్రొఫైల్‌లోకి వెళ్ళాలి.

మూడు వెర్టికల్‌ డాట్స్‌ మెనూ వద్దకు వెళ్ళి దానిని టాప్‌ చేయాలి.

డ్రాప్‌డౌన్‌ మెనూలోకి వెళ్ళి హైడ్‌ యువర్‌ స్టోరీ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. 

చర్యను కన్‌ఫర్మ్‌ చేసుకునేందుకు టాప్‌ ఆన్‌ హైడ్‌ చేయాలి.

ఇన్‌స్టాగ్రామ్‌ చూడకూడని ఫాలోయర్ల జాబితాను రూపొందించే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఇందుకోసం

మీ మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ని ఓపెన్‌ చేయాలి.

మీ ప్రొఫైల్‌లోకి వెళ్ళి ప్రొఫైల్‌ పిక్చర్‌పై క్లిక్‌ చేయాలి

త్రీ-హారిజాంటల్‌-లైన్‌ మెనూని టాప్‌ చేయాలి.

డ్రాప్‌డౌన్‌ మెనూ నుంచి సెట్టింగ్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. 

ప్రైవసీ ఆప్షన్‌ దగ్గరకి వెళ్ళాలి.

ఇంటరాక్షన్‌ టాబ్‌ కింద స్టోరీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

హైడ్‌ స్టోరీ ఫ్రమ్‌ని టాప్‌ చేయాలి.

చివరిగా వద్దనుకునే ఫాలోయర్లను సెలెక్ట్‌ చేసి, మార్పులను అప్‌డేట్‌ చేసుకోవాలి. 


ఇక్కడ హైడింగ్‌ అంటే యూజర్లను కంప్లీట్‌గా బ్లాక్‌ చేయడం కాదు. ఎంపిక చేసిన వ్యక్తులకు మీ స్టోరీలను చూపించకూడదు అనుకుంటున్నారు అంతే. అందుకోసం ఈ పద్ధతిని ఉపయోగించుకుంటున్నాం. 

Updated Date - 2022-07-02T08:57:04+05:30 IST