అమ్మో..తేతలి జంక్షన్‌!

ABN , First Publish Date - 2021-12-09T06:21:09+05:30 IST

తేతలి జంక్షన్‌ ప్రమాదాలకు నిలయంగా మారింది.

అమ్మో..తేతలి జంక్షన్‌!
తేతలి జంక్షన్‌

అర్ధరాత్రి యథేచ్ఛగా తెరిచే ఉంటున్న దుకాణాలు

ప్రమాదాలకు కేరాఫ్‌గా మారిన వైనం 

పట్టించుకోని అధికారులు

తణుకు, డిసెంబరు 8: తేతలి జంక్షన్‌ ప్రమాదాలకు నిలయంగా మారింది.  రాత్రయితే చాలు రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రమాద కరంగా మారింది. జంక్షన్‌లో వ్యాపార దుకాణాలు రాత్రి సమయాల్లో  యథే చ్ఛగా తెరిచే ఉంటున్నాయి. సాధారణంగా జాతీయ రహదారి పక్కన దుకా ణాలు రాత్రి 9 గంటల తర్వాత మూసివేయాలి. అయితే ఈ జంక్షన్‌లో మాత్రం ఆ నిబంధనలు కానరావడంలేదు. దీంతో రాత్రి సమయాల్లో ఆ వ్యాపార దుకాణాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. అసలే జాతీయ రహదారి కావడంతో వాహనాలు వేగంగా వస్తుంటాయి.  తాడేపల్లిగూడెం నుంచి వచ్చే వాహనాలు తేతలి బ్రిడ్జి దిగిన దగ్గర నుంచి పల్లంగా ఉండడంతో మరింత వేగంగా వస్తున్నాయి. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టడంతో నిత్యం రాత్రి ప్రమాదం పొంచి ఉంటుంది. హైవే పెట్రోలింగ్‌ పోలీసులు నిత్యం అటూ ఇటూ తిరుగుతున్నా ఎందుకో మరి ఈ జంక్షన్‌ వైపు మాత్రం చూడ డం లేదు. కనీసం పట్టించుకోవడంలేదు. దీంతో వాహనదారులు ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోనని తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రుళ్లు  దుకాణాలు తెరచి ఉన్నా  వాటిని మూయించాల్సిన హైవే పోలీసు లు చూసీచూడనట్టు వ్యహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  ఇప్పటికైనా అధికారులు హైవే పక్కన గల షాపులను నిర్ణీత సమయానికి మూయిం చాలని వాహనదారులు కోరుతున్నారు. దీనిపై రూరల్‌ ఎస్‌ఐ ఎం. రాజ్‌కు మార్‌ను వివరణ కోరగా రాత్రి 9 తర్వాత షాపులు  షాపులు మూతపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2021-12-09T06:21:09+05:30 IST